
రాష్ట్ర హాకీ జట్టుకు ముగ్గురు బాలికలు
రాష్ట్ర జట్టుకు ఎంపికై న హాకీ క్రీడాకారిణులు
యలమంచిలి రూరల్: జూనియర్ మహిళల రాష్ట్ర హాకీ జట్టుకు జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారిణులు ఎంపికై నట్టు హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొఠారు నరేష్ మంగళవారం స్థానిక విలేకరులకు తెలిపారు. దేవరాపల్లి మండలం పెదనందిపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి ఝాన్సీ, కె కోటపాడు మండలం ఎ.భీమవరం గ్రామానికి చెందిన తర్ర శైలజ, నక్కపల్లికి చెందిన కొఠారి లలిత జిల్లా నుంచి రాష్ట్ర హాకీ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరు కాకినాడలో జరుగుతున్న జాతీయ హాకీ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని నరేష్ తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతాయన్నారు.