బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
నక్కపల్లి: జాతీయరహదారిపై చినదొడ్డిగల్లు సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరి గిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మండపేటకు చెందిన నల్లబారిక శివ(25) చినదొడ్డిగల్లు వద్ద గల మా మిడి దుకాణాల వద్ద పనిచేస్తున్నాడు. ఉదయం రోడ్డు దాటుతుండగా నక్కపల్లినుంచి తునివైపు వెళ్తున్న మోటారు సైకిల్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన శివను తుని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ తీసుకువెళతుండగా మార్గమధ్యంలో చనిపోయినట్టు కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు.


