పోలింగ్‌ కేంద్రాల వద్దసౌకర్యాల కల్పన | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల వద్దసౌకర్యాల కల్పన

Nov 3 2026 1:21 AM | Updated on Nov 3 2026 1:21 AM

ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

కొయ్యూరు: పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ స్పష్టం చేశారు. ఆయన సోమవారం రావణాపల్లి, ఎం.మాకవరం పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఈ మేరకు ఆయన వసతుల కల్పనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్‌, వృద్ధులు ఓటు వేసేందుకు వీలుగా ర్యాంప్‌లను ఏర్పాటు చేయాలని ఆర్‌వో నరసింహారావు, తహసీల్దారు ప్రసాదరావును పీవో ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు నిర్భయంగా వచ్చి ఓటు వేయవచ్చన్నారు. అనంతరం అయ్యప్ప మాలధారణలో ఉన్న పీవో.. సింగవరం షిర్డీసాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడే భిక్ష చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement