సాక్షి, పాడేరు: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో గిరిజన గ్రామాల్లో ఓటరు స్లిప్‌ల సందడి నెలకొంది. ఈ నెల 5న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నిశాంతి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఓటరు స్లిప్‌ల పంపిణీ చేపట్టారు. వీఆర్‌వోలు, బీఎల్‌వోలతో పాటు ఇతర సిబ్బంది గ్రామాలను సందర్శించి ఓటరు జాబితా ప్రకారం స్లిప్‌లను అందజేస్తున్నారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,98,467 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటర్లందరికీ స్లిప్‌లు అందేలా ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది.


