సాక్షి, పాడేరు: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రచార చిత్రాల్లో సీఎం, మంత్రుల ఫొటోలు కొనసాగుతున్న విషయంపై ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా ఎన్నికల యంత్రాంగం స్పందించింది. సంబంధిత అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రచార వాహనంపై ఉన్న పోస్టర్లో సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఫొటోలతో పాటు, చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద ప్రభుత్వ పథకాల ప్రచార పోస్టర్లో ఉన్న సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఫొటోలపై స్టిక్కర్లు అంటించారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులకు వివరణ లేఖలు కూడా పంపించారు.


