ముగిసిన నామినేషన్ల పర్వం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నామినేషన్ల పర్వం

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

● రాత్రి వరకు కొనసాగిన స్వీకరణ

● జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకుఉత్సాహంగా దాఖలు

సాక్షి, పాడేరు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. అన్ని రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లాలో 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ నామినేషన్లను స్వీకరించారు. ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. చివరిరోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నామినేషన్ల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. పాడేరు ఐటీడీఏ కార్యాలయంతో పాటు అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిశాంతి, జిల్లా ఎన్నికల పరిశీలకుడు కూర్మనాథ్‌, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్‌ కలెక్టర్‌ నాగసాహితి నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement