కమ్మేసిన పొగమంచు | - | Sakshi
Sakshi News home page

కమ్మేసిన పొగమంచు

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

ముంచంగిపుట్టు: మన్యంలో చలి తీవ్రత పెరుగుతోంది. మండలంలో దట్టమైన మంచు కురుస్తుండటంతో జనజీవనం చలికి వణికిపోతోంది. శుక్రవారం ఉదయం మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలు మంచు దుప్పటిని తలపించాయి. ఎటుచూసినా మంచు తెరలు కమ్ముకోవడంతో పరిసరాలు సైతం సరిగా కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం వేళల్లో మంచు అందాలు కనువిందు చేస్తున్నప్పటికీ, చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

● రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లే కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులు చలికి గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచే చలి ప్రభావం మొదలవుతుండగా, ఉదయం 9 గంటల వరకు తీవ్రత అధికంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామాల్లో పలువురు చలి మంటలు వేసుకుంటున్నారు. ఉదయం పనులకు వెళ్లేవారు వెచ్చదనం కోసం మంటల వద్ద కొద్దిసేపు గడుపుతున్నారు.

● మరోవైపు, దట్టమైన మంచు కారణంగా రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడంతో హెడ్‌లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. మంచు కురిసే సమయంలో వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సాయంత్రం నుంచి ఉదయం వరకు చలి ప్రభావం కొనసాగుతుండటంతో ప్రజలు వెచ్చని దుస్తులు ధరించి బయటకు రావాల్సి వస్తోంది. మన్యంలో పెరుగుతున్న చలి ప్రభావం రోజువారీ జీవనంపై స్పష్టంగా కనిపిస్తోంది.

డుంబ్రిగుడ: మండలంలోని మంచు శుక్రవారం ఒక్క సారిగా కురవడంతో మండలంలోని పర్యాట ప్రదేశాలు, రోడ్లు మంచుతో అలరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement