దోమల నివారణపైప్రత్యేకదృష్టి | - | Sakshi
Sakshi News home page

దోమల నివారణపైప్రత్యేకదృష్టి

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

● జిల్లా మలేరియా అధికారి తులసి

జి.మాడుగుల: గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని జిల్లా మలేరియా అధికారి తులసి సూచించారు. శుక్రవారం జి.మాడుగుల మండలంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం రామాలయం వీధిలో నిర్వహిస్తున్న డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రతి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు వృద్ధి చెంది ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వివరించారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశా కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారులు నడిగట్ల ప్రకాష్‌, కంబిడి సుబ్రమణ్యం, హెచ్‌ఏలు కొత్తందొర, శోభన్‌బాబు, ఏఎన్‌ఎం గాయత్రి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement