హోరెత్తుతున్న పుర ప్రచారం | - | Sakshi
Sakshi News home page

హోరెత్తుతున్న పుర ప్రచారం

Oct 24 2026 4:53 AM | Updated on Oct 24 2026 4:53 AM

నర్సీపట్నం : పురపాలకలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వార్డుల బాట పడుతున్నారు. పురపాలకలో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ నాయకులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా వివిధ సామాజిక వర్గాల పెద్దలు, నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో జరిగిన సాధారణ పోలింగ్‌ సరళి ఆధారంగా బలాబలాలను బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీనికి అనుగుణంగా విజయానికి అనుసరించాల్సిన విధానాలపై నేతలు సమాలోచనలు చేస్తున్నారు.

పురపాలికలో చైర్‌పర్సన్‌ అభ్యర్థి చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, పలువురు వార్డు సభ్యులు పాల్గొని తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ అభ్యర్థి చింతకాయల పద్మావతి సైతం ప్రచారాన్ని విస్తృతం చేశారు.

జోన్‌ పరిధిలో కార్పొరేటర్‌ అభ్యర్థుల ప్రచారం

అనకాపల్లి : జోన్‌ పరిధిలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్ధులు ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. 109వ వార్డు అభ్యర్ధిని కర్రి లలిత గవరపాలెం, కాముచెట్టు ఏరియాలోను, సతకంపట్టు, వెంకన్నకొట్టు తదితర ప్రాంతాల్లోను, 110 వార్డు అభ్యర్ధిని ఉగ్గిన జ్యోత్స్న పద్మజ శారదా కాలనీ, వేల్పులవీధి, రజకుల కాలనీలోను ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పాలనకు, కూటమి పాలనకు ప్రజలకు అందిన సంక్షేమ పథకాలపై వివరించారు. ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని, ప్రభుత్వం ప్రజల నడ్డివిరిచే విధంగా పాలన సాగుతుందన్నారు. ఓటర్లు రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని బలపర్చాలని వారు కోరారు. 109వ వార్డులో టీడీపీ అభ్యర్థి బుద్ద జ్యోతి, 110 వార్డులో జనసేన అభ్యర్థి తాడి శాంతకుమారి, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, 109వ వార్డు ఇన్‌ఛార్జ్‌ కె.ఎం.నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

అనకాపల్లి టౌన్‌: జీవీఎంసీ 112వ వార్డు పరిదిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి జాజుల ప్రసన్న లక్ష్మి, రమేష్‌ ప్రచారం నిర్వహించారు. వార్డులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 111వ వార్డులో బీజేపీ అభ్యర్ధి పలకా యశోద ఎన్నికల ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్ధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement