కొయ్యూరు: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చింతపల్లి ఏఎస్పీ నిరంజన్ మహేంద్ర సిన్హా అన్నారు. శుక్రవారం కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను పరిశీలించి, సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఈశ్వర్‌వర్మను ఆదేశించారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
చింతపల్లి ఏఎస్పీ నిరంజన్ మహేంద్ర సిన్హా
నామినేషన్ల ప్రక్రియ పరిశీలన
భద్రతా చర్యలపై ఆరా
వివాదాలకు తావులేకుండా చర్యలు
పోలీసు అధికారులకు ఆదేశాలు


