మానవత్వం చాటుకున్న అరకు ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటుకున్న అరకు ఎమ్మెల్యే

Oct 18 2026 2:00 AM | Updated on Oct 18 2026 2:00 AM

డుంబ్రిగుడ: హుకుంపేట మండల పరిధిలోని బోడిగపుట్టు సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. అరకులోయ నుంచి పాడేరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బొల్తా పడడంతో యుకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే ప్రమాదాన్ని గమనించి తన కారును ఆపి క్షతగాత్రుడి పరిస్థితిని చూసి స్వయంగా అక్కడే ఉండి ఓ ఆటో ద్వారా క్షతగాత్రుడిని డుంబ్రిగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పీహెచ్‌సీ సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే చూపిన చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement