అప్పన్నస్వామికి వైభవంగా ఆర్జిత సేవలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నస్వామికి వైభవంగా ఆర్జిత సేవలు

Oct 18 2026 2:00 AM | Updated on Oct 18 2026 2:00 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శనివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 1001 నామాలతో అర్చన జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు.

శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం జరిపారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.

వైభవంగా గరుడ సేవ

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వెండి గరుడ వాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. విశేష హారతులు అందించారు. భక్తులను గరుడ వాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement