పాడేరు : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమయాత్తం చేసేందుకు ఆదివారం ఉదయం 9గంటలకు పాడేరు పట్టణంలోని శ్రీమోదకొండమ్మ తల్లీ ఓపెన్ ఆడిటోరియంలో వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కురుసాల కన్నబాబు, పశ్చి గోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ పరిశీలకులు చింతలపూడి వెంకటరామయ్య, నియోజకవర్గ పరిశీలకులు ఏడువాక సత్యారావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. సమావేశానికి అరకు, పాడేరు ఎమ్మెల్యేలతో పాటు జిల్లాలోని మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ అనుబంధ విభాగాల జిల్లాల అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుడు, పార్టీలో వివిద హోదాల్లో ఉన్న నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆశావాహులు తప్పకుండా హాజరు కావాలని కోరారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు వెల్లడి


