ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

పాడేరు రూరల్‌: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం పాడేరు కేంద్రంలో గల కాఫీ హౌస్‌ వద్ద నిర్వహించారు. కమిఈ జిల్లా అధ్యక్షుడిగా మోరి మోహనబాబు, ప్రధాన కార్యదరన్శిగా చిన్న సింహచలంలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా 19 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు హక్కులు చట్టాల అమలుపై మరింత శ్రద్ధతో పనిచేస్తామన్నారు. అనంతం కార్యవర్గ సభ్యులతో పాటు సహచార ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా కమిటీ ప్రతినిధులు రాజశేఖర్‌రెడ్డి, రవీంద్ర, నాయకులు లక్ష్మణ్‌, రవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement