జి.మాడుగుల: మండలంలో పలు గ్రామాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులు, భీకర శబ్ధాలతో పిడుగులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. మండలంలో బొయితిలి పంచాయతీలో అడవిలో మేతకు వెళ్లిన మేకలు అక్కడి భీకర శబ్ధంతో పిడుగుపాటుకు అక్కడక్కడే మృతి చెందాయి. పులుసుమామిడి గ్రామానికి చెందిన పూజారి రాజేష్కు చెందిన 4 మేకలు, మాజీ ఎంపీటీసీ తెరడా బ్రహ్మాలింగంకు చెందిన ఒక మేక, పూజారి గంగరాజుకు చెందిన ఒక మేక, పూజారి సన్యాసయ్యకు చెందిన ఒక మేక, పూజారి చిరంజీవికు చెందిన ఒక మేక మృతి చెందినట్టు బాధితులు తెలిపారు. మృతి చెందిన మేకలు విలువ రూ. సుమారు 1.50లక్షలు ఉంటుందని వారు చెప్పారు. ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.


