కూటమిలో చిచ్చు! | - | Sakshi
Sakshi News home page

కూటమిలో చిచ్చు!

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

● టీడీపీ వైఖరిపై జనసేన, బీజేపీ అసంతృప్తి ● రెండు పార్టీల నుంచి కౌన్సిలర్‌ అభ్యర్థుల నామినేషన్లు

నర్సీపట్నం: నర్సీపట్నం కూటమిలో సీట్ల సర్దుబాటు చిచ్చు రేపుతోంది. టీడీపీ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న జనసేన, బీజేపీ నేతలు సొంతంగా అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు. ఇప్పటికే జనసేన తరఫున చైర్‌పర్సన్‌ స్థానానికి మాజీ కౌన్సిలర్‌ అద్దెపల్లి సౌజన్య ఈ నెల 16న నామినేషన్‌ వేయగా.. తాజాగా రెండు పార్టీల నుంచి పలువురు కౌన్సిలర్‌ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం రాజకీయ ప్రకంపనలు రేగాయి. జనసేన తరఫున 11వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిగా మారిశెట్టి రాజా శనివారం ఆ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యుడు అప్పన్న దొరబాబు, టౌన్‌ పార్టీ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్‌ ఆధ్వర్యంలో నామినేషన్‌ వేశారు. 8వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులుగా జనసేన నుంచి సురకాసుల నానాజీ, సురకాసుల గోపి నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు జనసేన బాటలోనే బీజేపీ కూడా పయనిస్తోంది. 9వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిగా సరసా సీతా మహాలక్ష్మి బీజేపీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ కిల్లాడ వెంకట సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంరెడ్డి సూర్యనారాయణ, టౌన్‌ పార్టీ అధ్యక్షుడు బోళెం దొరబాబు సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ నుంచి తమకు కనీస సమాచారం కూడా అందలేదని ఆయా పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ నుంచి మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement