కొత్తకోటలో రూ.7 లక్షల నోట్లతో దర్శనమిస్తున్న దుర్గమ్మ
రావికమతం: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని కొత్తకోటలో దుర్గాదేవి మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత రూ.7 లక్షల నోట్లతో అమ్మవారిని అలంకరించారు. అర్చకుడు వేపాడ రామకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.
పెద్దేరులోకి వరద నీరు
మాడుగుల: మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పెద్దేరు జలాశయం క్యాచ్మెంట్ ఏరియాలో 20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జలాశయంలోకి 100 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు తెలిపారు.
జీఎస్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు
నర్సీపట్నం: పట్టణంలో వ్యాపార దుకాణాలపై జీఎస్టీ అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కిరణా హోల్సేల్ దుకాణాలతో పాటు పలు వ్యాపార దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. జీఎస్టీ చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న సమాచారంతో దాడులు చేశారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, కొనుగోలు, అమ్మకాల బిల్లులు, స్టాక్ వివరాలను పరిశీలించినట్లు తెలిసింది.


