అరకు పైనరీకి స్వచ్ఛాంధ్ర,పర్యాటక పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

అరకు పైనరీకి స్వచ్ఛాంధ్ర,పర్యాటక పురస్కారాలు

Oct 3 2026 2:14 AM | Updated on Oct 3 2026 2:14 AM

డుంబ్రిగుడ: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి చేసిన అరకు పైనరీకి రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా డీఎఫ్‌వో ఉమామహేశ్వరి ఈ అవార్డును అందుకున్నారు. అలాగే గత నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ చేతుల మీదుగా అరకు పైనరీకి రాష్ట్ర స్థాయి ఉత్తమ పర్యాటక పురస్కారంతో పాటు, సినిమా చిత్రీకరణకు ఉత్తమ ప్రదేశంగా అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అరకు పైనరీకి ఈ పురస్కారాలు దక్కడం గొప్ప గుర్తింపని, ఇది ఉమ్మడి విశాఖ జిల్లాకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి చలపతి, అరకు రేంజర్‌ కోటేశ్వరరావు, అరకు పైనరీ మేనేజర్‌ ఎం. శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement