సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుకు నిధులు లేవని చెబుతూనే, మరోపక్క సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పెద్ద మొత్తంలో ఎలా ఖర్చు చేస్తారు? ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అందించకుండా సోషల్ మీడియాకు ఏ విధంగా నిధులు సమకూరుస్తున్నారు? ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుగా నెరవేర్చాలి. కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి వలంటీర్లకు న్యాయం చేయాలి.
– బురిడి బుచ్చన్న, మండల కార్యదర్శి, ఏపీ వార్డు వలంటీర్ల సంఘం అరకులోయ


