మహాత్ముని ఆశయాలు ఆచరణీయం | - | Sakshi
Sakshi News home page

మహాత్ముని ఆశయాలు ఆచరణీయం

Oct 3 2026 2:14 AM | Updated on Oct 3 2026 2:14 AM

● ఘనంగా గాంధీ జయంతి

● వాడవాడలా నివాళి

సాక్షి, పాడేరు: జాతిపిత మహాత్మ గాంధీ జయంతిని శుక్రవారం పాడేరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక మోదకొండమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి కలెక్టర్‌ టి. నిశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ఐటీడీఏ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సబ్‌ కలెక్టర్‌ నాగ వెంకట సాహిత్‌ తమ అధికారులతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, జేసీ, ఐటీడీఏ పీవోలు మాట్లాడుతూ.. మహాత్మ గాంధీ ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. శాంతి, అహింసా మార్గాలే దేశ ప్రగతికి అసలైన పునాదులని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు.

చింతపల్లి: మహాత్మా గాంధీ చేపట్టిన అహింసా, సత్య మార్గాల బోధనలతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ డి. ఆదిలక్ష్మి అన్నారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం విద్యార్థులకు గాంధీజీ బోధనలు, ఆయన ఆశయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బయ్యపురెడ్డి, సందీప్‌నాయక్‌, జోగారావు, వెంకటేష్‌, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement