గ్రూపు–2 స్టడీ మెటీరియల్‌ అందజేత | - | Sakshi
Sakshi News home page

గ్రూపు–2 స్టడీ మెటీరియల్‌ అందజేత

Oct 3 2026 2:14 AM | Updated on Oct 3 2026 2:14 AM

కొయ్యూరు: మండలంలోని చింతవానిపాలెంకు చెందిన జర్త దేవీలాల్‌కు శుక్రవారం కొయ్యూరుకు చెందిన దుమంతి సత్యనారాయణ గ్రూప్‌–2 స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. దేవీలాల్‌ గ్రూప్‌–2 పరీక్షకు సన్నద్ధమవుతూ మెటీరియల్‌ కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలుసుకుని సత్యనారాయణ ఈ సహాయం చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరాలని దేవీలాల్‌ను ఆకాంక్షించారు. మన ప్రాంతానికి చెందిన యువత ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడితే అంతకంటే సంతోషం మరొకటి లేదని, గిరిజన యువత ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాటం కనకరాజు, గడుతూరి జోగారావు, నడిగెట్ల రాజు, కోరుకొండ అప్పారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement