● కలెక్టర్ నిశాంతి
● ఘనంగా స్వచ్ఛాంధ్ర–2026అవార్డుల ప్రదానం
సాక్షి, పాడేరు: గ్రామాలు, పరిసరాల స్వచ్ఛతను ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుని, తమ జీవన విధానాన్ని మార్చుకోవాలని కలెక్టర్ టి. నిశాంతి పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర–2026 అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ఎన్‌జీవోలతో పాటు ప్రజలంతా సమిష్టిగా భాగస్వాములై స్వచ్ఛతను నిరంతరం కొనసాగించాలని కోరారు. పారిశుధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన అవార్డు గ్రహీతలందరికీ ఆమె అభినందనలు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మార్గదర్శకాల మేరకు జిల్లాలో 16 కేటగిరీలకు సంబంధించి 47 జిల్లా స్థాయి అవార్డులకు ఎంపికై న అధికారులు, పారిశుధ్య కార్మికులకు జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, సబ్‌కలెక్టర్ నాగ వెంకట సాహిత్ ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు విభాగం చైర్మన్ వంపూరు గంగులయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


