డిమాండ్లు పరిష్కరించాలి.. లేదంటే ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

డిమాండ్లు పరిష్కరించాలి.. లేదంటే ఉద్యమం

Oct 3 2026 2:14 AM | Updated on Oct 3 2026 2:14 AM

● సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్‌రావు

● పారిశుధ్య కార్మికుల సమస్యలపై హెచ్చరిక

పాడేరు రూరల్‌: పారిశుధ్య కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్‌రావు హెచ్చరించారు. పాడేరు మేజర్‌ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని, కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ చేపట్టిన సమ్మెలో భాగంగా శుక్రవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైదాన ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా ప్రతీ పారిశుధ్య కార్మికుడికి రూ. 21 వేల వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ’సమాన పనికి సమాన వేతనం’ ఇవ్వడంతో పాటు, మృతి చెందిన కార్మికుడి అంత్యక్రియల నిమిత్తం మట్టి ఖర్చుల కింద తక్షణ సాయంగా రూ. 20 వేలు అందజేయాలన్నారు. ప్రస్తుతం పాడేరు జిల్లా కేంద్రంగా మారడంతో పనుల రద్దీ పెరిగి, ఉన్న 18 మంది కార్మికులపై పనిభారం విపరీతంగా పెరిగిందని, తక్షణమే అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. కార్మికులకు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం అందించాలని కోరారు. అలాగే హెల్త్‌ అలవెన్స్‌ కింద రూ. నాలుగు వేలు చెల్లించాలని, ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు సేఫ్టీ పరికరాలు, యూనిఫాంలు తప్పనిసరిగా అందించాలన్నారు. కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, కనీస బాధ్యత కూడా తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ పారిశుధ్య కార్మికుల సమస్యలపై కూడా పెట్టాలని, ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంపత్‌, బాలన్న, సూరిబాబు, సుబ్బారావు, అప్పారావు, ఈశ్వరరావు, చిన్న, జోగారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement