మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం

Oct 3 2026 2:14 AM | Updated on Oct 3 2026 2:14 AM

ముంచంగిపుట్టు: ప్రజల భాగస్వామ్యంతోనే ఆపరేషన్‌ త్రిశూల్‌ లక్ష్యం నెరవేరుతుందని జిల్లా అదనపు ఎస్పీ వై. శృతి అన్నారు. మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ జంక్షన్‌ నుంచి సాగిన ఈ ర్యాలీ అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా అదనపు ఎస్‌పీ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని, వేధింపులు జరిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే గంజాయి, మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని, రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అనంతరం అదనపు ఎస్‌పీ శృతి, పాడేరు డీఎస్పీ వి. రాజసింహారెడ్డి, జీ.మాడుగుల సీఐ లక్ష్మణరావు తదితరులు బస్సులు, ఆటోలపై ’ఆపరేషన్‌ త్రిశూల్‌’ పోస్టర్లను అంటించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అరవింద్‌, ఎస్‌ఐ నాని, పోలీసులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

అదనపు ఎస్పీ శృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement