సమస్యల పరిష్కారానికిసత్వర చర్యలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికిసత్వర చర్యలు

Jul 25 2026 12:29 AM | Updated on Jul 25 2026 12:29 AM

కలెక్టర్‌ నిశాంతి

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌లో79 వినతుల స్వీకరణ

పాడేరు: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నిశాంతి ఆదేశించారు.ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నిశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, ఇన్‌చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ భుజంగరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 79 వినతులు స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి అత్యధికంగా 38, వైద్యారోగ్య శాఖ–6, డీఆర్డీఏ–4, డ్వామా–4, ఆర్‌డబ్ల్యూఎస్‌–4, పీఆర్‌ఐ–4, పంచాయతీరాజ్‌–4, ఐసీడీఎస్‌–3, ఐటీడీఏ–3, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌–3, విద్యాశాఖ–2, ఏపీఈపీడీసీఎల్‌–1, ట్రెజరీ–1, ఎస్‌ఎంఐ–1 వినతులు ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ నిశాంతి మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement