మృతుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తాం | - | Sakshi
Sakshi News home page

మృతుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తాం

Jul 12 2026 12:35 AM | Updated on Jul 12 2026 12:35 AM

● డీఎల్పీవో కుమార్‌

● డీఎల్పీవో కుమార్‌

రాజేంద్రపాలెం గ్రామసభలో

జాబితాను పరిశీలిస్తున్న డీఎల్పీవో కుమార్‌

కొయ్యూరు: మరణించిన వ్యక్తుల పేర్లను ఓటరు జాబితా నుంచి శాశ్వతంగా తొలగిస్తామని డీఎల్పీవో పీఎస్‌ కుమార్‌ తెలిపారు. శనివారం ఎన్నికల ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఆయన వివిధ గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మరణించిన వారి పేర్లను తొలగించే ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని, కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. అలాగే, శాశ్వతంగా వలస వెళ్లి తిరిగి రాని వారి పేర్లను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి తొలగిస్తామన్నారు. ఇప్పటికే పలు బూత్‌లలో మరణించిన వారి పేర్లను తొలగించడం జరిగిందని, మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో రెండు రోజుల గడువు ఉందని తెలిపారు. ఈ పనిని వేగవంతం చేసేందుకు బీఎల్‌వోలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రసాదరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement