గుండెపోటుతో జూనియర్‌ కళాశాల వార్డెన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో జూనియర్‌ కళాశాల వార్డెన్‌ మృతి

Jul 12 2026 12:35 AM | Updated on Jul 12 2026 12:35 AM

● డుంబ్రిగుడలో విషాదంటీఎన్‌ ప్రతాప్‌

డుంబ్రిగుడ: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వసతి గృహంలో వార్డెన్‌గా పనిచేస్తున్న పల్లాసి రవికుమార్‌ శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి వసతి గృహంలో ఉండగా రవికుమార్‌ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది వెంటనే ఆయనను హుటాహుటిన అరకులోయలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విధుల నిర్వహణలో తీవ్రమైన పని ఒత్తిడి కారణంగానే ఆయన గుండెపోటుకు గురై ఉంటారని ప్రాథమికంగా తెలుస్తోంది. రవికుమార్‌ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కళాశాల అధ్యాపకులు, తోటి సిబ్బంది, విద్యార్థులు ఈ వార్త విని తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement