మూలకు చేరిన అటవీశాఖ వాహనం | - | Sakshi
Sakshi News home page

మూలకు చేరిన అటవీశాఖ వాహనం

Feb 19 2026 9:49 AM | Updated on Feb 19 2026 9:49 AM

మూలకు చేరిన అటవీశాఖ వాహనం

మూలకు చేరిన అటవీశాఖ వాహనం

కొయ్యూరు: అటవీ శాఖకు చెందిన జీపు నెల రోజులుగా కొయ్యూరులో మూలకు చేరింది. దీనికి అవసరమైన మరమ్మతులు చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగా వాహనం కలప డిపోలోనే ఉండిపోయింది. సాధారణంగా అటవీ సిబ్బంది ఈ వాహనం ద్వారా రాత్రి సమయాల్లో వివిధ రహదారుల్లో నిఘా, పర్యవేక్షణ చేసేవారు. అయితే, ఇటీవల స్టీరింగ్‌ సమస్య తలెత్తడంతో వాహనం కదల్లేని స్థితికి చేరుకుంది. ఫలితంగా అటవీ శాఖ తనిఖీలు నిలిచిపోయాయి. దీనిపై సెక్షన్‌ అధికారి శ్రీరాములు మాట్లాడుతూ.. వాహనాన్ని మరమ్మతుల నిమిత్తం నర్సీపట్నం పంపిస్తున్నామని, వారం రోజుల్లో తిరిగి వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించామని, త్వరలోనే వాహనాన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement