గంజాయి కేసులో పరారైన నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి కేసులో పరారైన నిందితుడి అరెస్ట్‌

Feb 17 2026 7:38 AM | Updated on Feb 17 2026 7:38 AM

గంజాయి కేసులో పరారైన నిందితుడి అరెస్ట్‌

గంజాయి కేసులో పరారైన నిందితుడి అరెస్ట్‌

యలమంచిలి రూరల్‌: గంజాయి అక్రమ రవాణా కేసులో ఏడాది కాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని యలమంచిలి రూరల్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. నిందితుడ్ని విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించారు. వివరాలివి..యలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో క్రైమ్‌ నంబర్‌ 266/23 మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడు చేపల కార్తీక్‌ను పోలీసులు అప్పట్లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో నిందితుడిపై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ మేరకు యలమంచిలి రూరల్‌ పీఎస్‌ సిబ్బంది నిందితుడి కోసం నిఘా పెట్టారు. ఒడిశా రాష్ట్రం కటక్‌లో కార్తీక్‌ నివాసముంటున్నట్టు తెలుసుకున్న పోలీసులు ముగ్గురు కానిస్టేబుళ్లతో కూడిన బృందాన్ని ఒడిశాకు పంపించారు. వారు నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడ్ని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన యలమంచిలి రూరల్‌ పీఎస్‌ సిబ్బంది శ్రీనివాస్‌(హెచ్‌సీ), కానిస్టేబుళ్లు డీఎంఎస్‌ రెడ్డి,హోంగార్డు రాజేష్‌లతో పాటు ఎస్‌ఐ ఎం.ఉపేంద్రలను ఎస్పీ తుహిన్‌సిన్హా, పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్‌ అభినందించారు.

ఆటో, బైకు ఢీ..యువకుడికి తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement