20 లీటర్ల సారా స్వాధీనం
మాడుగుల: అనకాపల్లి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్, స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ సిబ్బంది మండలంలో గురువారం దాడులు నిర్వహించారు. ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 24 లీటర్ల సారాతో కూర్మనాథపురం, కొత్తవలస గిరి గ్రామాలకు చెందిన అల్లంగి రాజు, సన్యాసిరావు పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసి సారాను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని ఎకై ్సజ్ సీఐ ఉపేంద్ర తెలిపారు. విచారణలో భాగంగా సారా సరఫరా చేసేవారిలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి గ్రామానికి చెందిన గోషన్న దొర, పోతురాజులపై కేసు నమోదు చేశామన్నారు. త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ కె.శ్రావణి, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌ఐ చినవీర్రాజు సిబ్బంది పాల్గొన్నారు.


