మంత్రి దృష్టికి రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు
శంకరరావును సత్కరిస్తున్న రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్
దేవరాపల్లి: విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యలను ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు వీఆర్వోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతల శంకరరావు తెలిపారు. విజయవాడలో రాష్ట్ర వీఆర్వోల సంఘం అధ్యక్షుడు ఈర్లె శ్రీరామమూర్తితో కలిసి రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్‌తోపాటు హోంమంత్రి అనితను గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. తాము ప్రస్తావించిన రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. ఇటీవల నూతన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన శంకరరావును రెవెన్యూ మంత్రి సత్కరించారు. జిల్లా వీఆర్వోల సంఘం అధ్యక్షుడు శశిధర్, జిల్లా డివిజన్ అధ్యక్షుడు పెదబాబు, జిల్లా జనరల్ సెక్రటరీ చిననాయుడు తదితర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.


