మత్సవానిపాలెంలో షూటింగ్ సందడి
షూటింగ్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాజు
రావికమతం: మండలంలో మత్సవానిపాలెంలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. విలేజ్ టాకీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చీన్ టపాక్ డుం డుం సినిమా షూటింగ్‌ను చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రోలుగుంట మండలం శరభవరం గ్రామానికి చెందిన యువ నిర్మాత నాగులపల్లి శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రానికి వై.ఎన్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. శుభం ఫేం హీరో గవిరెడ్డి శ్రీనివాస్, హీరోయన్‌గా బ్రిగిడా సాగ నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తండ్రీకొడుకు, తల్లిలపై ముహుర్తం షాట్ తీశారు. ఇక్కడ నాలుగు రోజుల పాటు చిత్రీకరణ జరగనుందని చిత్ర యూనిట్ తెలిపింది.


