దేశ నేతలకు తిరనాళ్ల వందనాలు
మాడుగుల రూరల్ : దేవతామూర్తులు, అమ్మవార్లకు తీర్థాలు, తిరునాళ్లు ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి పండగ నుంచి తీర్దాలు నిర్వహించడం అనవాయితీగా వస్తుంది. అయితే మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన కె.జె.పురం గ్రామంలో అమ్మవార్లకు, దేవతామూర్తులతో, పాటు దేశ నాయకులు విగ్రహలుకు ప్రతి ఏటా తీర్దాలు నిర్వహించడం అనవాయితీగా వస్తుంది. దేశ స్వాత్రంత్య్ర సముపార్జించిన భారత జాతి పిత మహత్మా గాంధీ, మాజీ దివంగత భారత ప్రధాని పండింట్ జవహర్‌లాల్ నెహ్రూ. అజాదు సుభాష్ చంద్రబోస్, రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, వంటి నేతలు విగ్రహలు ఈ గ్రామములో ప్రతిష్టించారు. అలాగే నాయకులు పేరుతో వీధులుకు కూడా నామకరణం చేసారు. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, విగ్రహలును ఈ గ్రామ తోలి గ్రామ సర్పంచ్ అయిన దివంగత పాలకుర్తి శ్రీరామూర్తి గారు 1957 సంవత్సరంలో విజయవాడ నుంచి ఈ విగ్రహలును రైలు మీద అనకాపల్లి వరకు తీసుకోచ్చి, అక్కడ నుంచి నాటుబండ్లు మీద గ్రామానికి తీసుకుని వచ్చి గ్రామంలో వేరు వేరు చోట ప్రతిష్టించారు. ఆయన తన సొంత సొమ్ముతో ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి ఈ మహత్తర పనికి శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో ఈ విగ్రహలకు తీర్థాలు చేయడం ప్రారంభించారు. ఆయన గతంలో జిల్లా బోర్డు సభ్యునిగా ఉండేవారు. అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఈ గ్రామానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి అయిన అతికంశెట్టి సింహాచలం సొంత ఖర్చుతో తయారు చేయించి పాలసొసైటీ వద్ద ఏర్పాటు చేశారు.
అలాగే అంబేద్కర్ విగ్రహంను ముకుందపురం గ్రామ మాజీ సర్పంచ్ అయిన కర్రి శ్రీరామూర్తి ఆర్దిక సహకారంతో కాలనీలో ఏర్పాటు చేశారు. ఏటా సంక్రాంతి తర్వాత తీర్థాలు నిర్వహిస్తారు. గాంధీ తీర్దం ప్రతి ఏటా ఆయన వర్థంతి మరుసటి రోజు జనవరి 31న గాంధీ వీధి ప్రజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఏటా అక్టోబరు 2న గాంధీ జయంతిని నిర్వహించడం పరిపాటి అయింది. అజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత సుభాష్ చంద్రబోస్ జయంతిని ఈ నెల 23న నిర్వమించడం జరుగుతుంది. అలాగే నెహ్రూ తీర్దం ప్రతి ఏటా ఫిబ్రవరి 8వ తేదీన నెహ్రూ వీధిలో ప్రజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో గల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని ఏటా ఏప్రిల్ 14న పండగలా నిర్వహించడంతో పాటు క్రీడా పోటీలు ఏర్పాటు చేస్తారు. అల్లూరి సీతారామరాజు జయంతి జూలై 4 వ తేదీన, నిర్వహిస్తున్నారు. దేశ నాయకులకు తీర్దాలు పేరుతో మంచి సంస్కృతి నెలకొంది. వీరితో పాటు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, జయంతులు, వర్థంతులు కూడా ఇక్కడ ఏటా నిర్వహిస్తారు.
గాంధీ వీధిలో గల జాతిపిత మహత్మా గాంధీ విగ్రహం
సింగ్ కాలనీలో గల
బి.ఆర్. అంబేద్కర్
కేజేపురంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహం
దేశ నేతలకు తిరనాళ్ల వందనాలు
దేశ నేతలకు తిరనాళ్ల వందనాలు


