పెళ్లైన పదేళ్లకు పుట్టిన బిడ్డ.. పాలు తాగలేదు.. ఊపిరి తీసుకోలేదు

Without Rs 20 Lakhs I Will Lose My Only Child To A Rare and Deadly Disease - Sakshi

పెళ్లై పదేళ్లు గడిచినా మాకు పిల్లలు కలగలేదు. మా నిరీక్షణ ఫలించి మేము తల్లిదండ్రులయ్యాం. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. పాలు తాగేందుకు పాప ఇబ్బంది పడుతుండటంతో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు, అన్నవాహికలో వ్రణం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పాప తీసుకునే ఫీడ్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నట్టుగా చెప్పారు.

లేకలేక పుట్టిన బిడ్డను కాపాడుకునేందుకు ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఆపరేషన్‌ చేయించాం. ఇక బిడ్డ ఆరోగ్యానికి ఢోకా లేదనే నమ్మకంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నాం. అవే మా జీవితంలో ఆనందంగా ఉన్న గడియలు. ఇలా ఇంటికి వచ్చామో లేదో సమస్య మళ్లీ మొదలైంది. ఊపిరి తీసుకోవడం పాపకు కష్టంగా మారింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం. అక్కడి నుంచి ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూఎంతో మంది డాక్టర్లను కలిశాం. చివరకు పాప ఆరోగ్యం కుదుటపడాలంటే మరో ఆపరేషన్‌ చేయక తప్పదని డాక్టర్లు తేల్చి చెప్పారు.

పాప ఆపరేషన్‌కి 20 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారను. మొదటి ఆపరేషన్‌ చేయించేందుకే ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టేశాం. తెలిసివారందరి దగ్గరా అప్పులు చేశాం. ఆర్నెళ్లుగా ఆస్పత్రుల చుట్టూనే తిరుగుతూ ఉండటంతో ఆయన ఉద్యోగం కూడా చేయడం లేదు. ఇప్పుడు మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. 
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

పాలు తాగడానికి, ఊపిరి తీసుకోవడానికి నా పసి పాపాయి ప్రతీ క్షణం ఇబ్బంది పడుతోంది. ఆమె ఒళ్లంతా సూదులు గుచ్చే ఉన్నాయి. ట్రీట్‌మెంట్‌ ఆగిపోయినా.. త్వరగా ఆపరేషన్‌ జరగకపోయినా పాప మాకు దక్కదు. అందుకే మెడికల్‌ ఎమర్జెన్సీలో ఫండ్‌ రైజింగ్‌ చేసే కెట్టోను సంప్రదించాం. పదేళ్ల తర్వాత పుట్టిన నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయగలరు. ఆమె ఆపరేషన్‌ అయ్యే ఖర్చుకు మీవంతు సహయం చేయగలరు.
సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి
 

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top