Details About Koubek Asia's First Education Metaverse Crypto Coin - Sakshi
Sakshi News home page

కౌబెక్‌.. ఏషియాలోనే మొదటి ఎడ్యుకేషన్‌ మెటావర్స్‌ క్రిప్టో ప్రాజెక్ట్‌

May 5 2022 7:08 PM | Updated on May 6 2022 3:24 PM

Details About Koubek Asias First Education Metaverse Crypto Coin - Sakshi

ఈమధ్య కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు ఎక్కువ మంది నోట నానుతున్న మాట క్రిప్టో కరెన్సీ లేదా క్రిప్టో కాయిన్స్‌. ఎందుకు ఈ క్రిప్టోకరెన్సీ గురించి ఇంత మధ్య చర్చిస్తున్నారనేందుకు సింపుల్‌ ఉదాహారణగా శిబా ఐఎన్‌యూ కాయిన్‌ గురించి చెప్పుకోవాలి. ఈ కాయిన్‌ విలువ 2021 జనవరి 1న 100 డాలర్లు ఉంటే అదే ఏడాది అక్టోబరు నాటికి దాని విలువ 47 మిలియన్లకు చేరుకుంది. రియల్‌ ఎస్టేట్‌, బంగారం ఆఖరికి జాక్‌పాట్‌లో కూడా ఈ స్థాయి రిటర్నులు రావడం కష్టం. అందుకే అందరి దృష్టి క్రిప్టో కరెన్సీ మీద పడింది.

క్రిప్టో కాయిన్లలో లాభాలు అధికంగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు ఈ కాయిన్లను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎకనామిక్స్‌కి మరో ప్రత్యామ్నయంగా టోకెనామిక్స్‌ అనేట్టుగా పరిస్థితి మారింది. ఉదాహారణకు ఒలంపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ కర్ట్‌  ఏంజెల్‌, క్రికెటర్‌ క్రిస్‌గేల్‌ తదితరులు ఇప్పటికే ఇందులో పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో కాయిన్ల వ్యవహారం అంతా సెలబ్రిటీలకేనా సామాన్యుల పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చింది కౌబెక్‌ ప్రాజెక్ట్‌.  బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీపై అమితమైన ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎంతో లోతైన పరిశోధనలు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు.

ఏషియాలోనే మొదటి మెటావర్స్‌ క్రిప్టో ప్రాజెక్టుగా ముందుకు వచ్చిన కౌబెక్‌ ప్రాజెక్టు ఇప్పుడు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ, టోకెనామిక్స్‌, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, మెటావర్స్‌, క్రిప్టో టోకెన్ల ట్రేడింగ్‌ అంశాల్లో లోతైన అవగాహన కల్పించే ఎడ్యుటెక్‌గా కౌబెక్‌ సేవలు అందిస్తోంది. ఇదే పరంపరలో కౌబెక్‌ ప్రాజెక్ట్‌ నుంచి కౌబెక్‌ టోకెన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. విలువ తరగడమన్నదే లేకపోవడంతో అనతి కాలంలోనే సగానికి పైగా కాయి‍న్లు ఇప్పటికే అయిపోయాయి. 

కౌబెక్‌ ప్రాజెక్టు  ప్రారంభమైన రెండు నెలల్లోనే కౌబెక్‌కు తొమ్మిది వేల మందికి పైగా హోల్డర్లు, 12 వేల మందికి పైగా సోషల్‌ మీడియా మెంబర్లను సాధించి ఇండియాలో టాప్‌ 10 క్రిప్టో సర్వీసెస్‌ జాబితాలో చోటు సాధించింది. అంతేకాదు ప్రఖ్యాతి చెందిన క్రిప్టో ఎక్సేంజీలైన కాయిన్‌ ఎక్సేంజీ వరల్డ్‌,  కాయిన్స్‌ బిట్‌, కాయిన్‌గైకో, ఎల్‌ బ్యాంక్‌ తదితర చోట్లలో సుస్థిర స్థానం సాధించింది. కౌబెక్‌ ప్రాజెక్టులో డెవలపింగ్‌, మార్కెటింగ్‌ టీమ్స్‌ ప్రత్యేకంగా పని చేస్తున్నాయి.

కౌబెక్‌ కాయిన్‌ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు డిజిటల్‌ గురుకుల్‌ ఎడ్యుటెక్‌ కంపెనీతో ఒప్పందం జరిగింది. దీంతో డిజిటల్‌ గురుకుల్‌ 44,850 విద్యార్థులు ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపేందుకు ఆస్కారం ఏర్పడింది. అంతేకాదు ఏషియాలో మరో 37 ఎడ్యుటెక్‌ సంస్థలతో కూడా సంప్రదింపులు సాగుతున్నాయి. 2022 మే 1 నుంచి కౌబెక్‌ స్టోర్‌ కూడా ప్రారంభమైంది. డాలర్‌ కౌబెక్‌ టోకెన్‌ చెల్లింపుల ద్వారా ఇక్కడ సేవలు/సర్వీసులు పొందే వీలుంది. (అడ్వెటోరియల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్