దండేపల్లి: వాళ్లిద్దరూ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు..పెళ్లి విషయం ప్రస్తావనకు రాగానే పట్టించుకోక పోవడంతో సదరు యువతి ప్రియుడి ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగింది. దండేపల్లి మండలం లింగాపూర్‌కు చెందిన అక్షర, అదే గ్రామానికి చెందిన మహేందర్ 2017 నుంచి ప్రేమించుకుంటున్నారు. గతంలో పెళ్లి విషయం చర్చించగా, మైనర్లు కావడంతో వాయిదా వేసుకుంటూ వచ్చారు. విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో యువతి ఆదివారం రాత్రి మహేందర్ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో అతను ఇంట్లో లేకపోవడం, అతని తల్లిదండ్రులు మాకేం తెలియదని చెప్పడంతో న్యాయం కోసం నిరాహార దీక్ష చేపట్టింది. సోమవారం గ్రామస్తులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో సదరు యువతి మళ్లీ నిరాహార దీక్ష కొనసాగిస్తోంది.


