జైపూర్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ సెలక్షన్స్లో మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. అండర్–17, 19 విభాగాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కోల నాగేశ్వరావు, వైస్ ప్రిన్సిపాల్ స్రవంతి తెలి పారు. సదరు విద్యార్థులను సోమవారం పా ఠశాలలో ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలన్నారు.


