మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఎగ్గడి భాస్క ర్ ఆదేశాల మేరకు సీఐ ప్రమోద్‌రావు ఆదివా రం రాత్రి స్థానిక ఒడ్డెర కాలనీ, గౌతమినగర్‌లో బెల్ట్‌షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రత్యేక బలగాలతో వెళ్లి బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న ఇళ్లలో తనిఖీ చేసి సుమారు రూ.40 వేల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీ నం చేసుకున్నారు. ఒడ్డెర కాలనీకి చెందిన ఒల్లెపు కుమార్, ఎడగొట్టు పున్నం, వల్లెపు సాయికుమార్, గౌతమినగర్‌కు చెందిన యెదా లక్ష్మణ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు మధుసూదన్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.


