మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గుడిపేటకు చెందిన చిత్తారి శ్రీనివాస్ (45) ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుడిపేట బస్టాండ్ సమీపంలో మంచిర్యాల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రుడిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బస్సు డ్రైవర్ భీమేశ్‌ను అదుపులోకి తీసుకుని బస్సును స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు.
ఒకరికి ఆర్నెల్ల జైలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): కులం పేరుతో దూషణ, చంపుతానని బెదిరింపులకు పాల్పడిన నిందితుడికి న్యాయమూర్తి ఆరునెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీకానపల్లికి చెందిన మెడపట్ల రామును అదే గ్రామానికి చెందిన గెల్లు కొమురయ్య చంపుతానని బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదు మే రకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై కిరణ్‌కుమార్ సోమవారం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా నేరం రుజువు కావడంతో జడ్జి బి.శశికుమార్ పైవిధంగా తీర్పునిచ్చారు.
పశువుల వ్యాన్ పట్టివేత
కాగజ్‌నగర్‌రూరల్: అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యాన్‌ను సోమవారం కాగజ్‌నగర్ మండలంలోని కాగజ్‌నగర్ ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై పట్టుకున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. కౌటాల మండల కేంద్రం నుంచి ఆరు పశువులను అక్రమంగా వ్యాన్‌లో మానెపల్లికి తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


