బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి

Nov 3 2026 1:09 AM | Updated on Nov 3 2026 1:09 AM

బోథ్‌: ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని రూ.6 లక్షల పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్‌ చేశారు. పంట నష్టంతో తీవ్ర మనస్తాపానికి గురై పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న బోథ్‌ మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు సంద భోజరెడ్డి, ధన్నూర్‌ గ్రామానికి చెందిన బద్దం రాజేశ్వర్‌రెడ్డి కుటుంబాలను సోమవారం పరామర్శించారు. ప్రభుత్వం జీవో 194 ప్రకారం రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని, కుటుంబ యజమానురాలికి నెలకు రూ.5వేల పింఛన్‌, పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. ఆయన వెంట నాయకులు వినయ్‌రెడ్డి, రవి, ఎన్‌.చిన్నయ్య, సహేందర్‌, నాగభూషణం, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement