ఆదిలాబాద్: క్రమశిక్షణతోనే క్రీడల్లో రాణించవచ్చని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ధ్యాన్ చంద్ హాకీ మైదానంలో సోమవారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14 బాలికల ఉమ్మడి జిల్లా స్థాయి హాకీ ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాలకు చెందిన క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణను అలవర్చుకోవడంతో పాటు ఆటపై అంకితభావంతో సాధన చేయాలని సూచించారు. పట్టుదల, నిరంతర శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్వో దయానందరెడ్డి, డీటీఎస్వో పార్థసారథి, ఆడే రామేశ్వర్ పాల్గొన్నారు.
ఎంపిక పోటీల్లో క్రీడాకారులు


