ధని వలస కార్మికుడికి ఊరట | - | Sakshi
Sakshi News home page

ధని వలస కార్మికుడికి ఊరట

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

● సీఎం ప్రవాసీ ప్రజావాణి, సాటా చొరవ ● వైట్‌ పాస్‌పోర్టు, ఎగ్జిట్‌ పర్మిట్‌ జారీ ● స్వదేశానికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమం

సారంగపూర్‌: ఉపాధికోసం సౌదీ అరేబియాకు వెళ్లి రియాద్‌లో చిక్కుకున్న మండలంలోని ధని గ్రామానికి చెందిన పతాని చింటుకు సీఎం ప్రవాసీ ప్రజావాణి, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) చొరవతో ఊరట లభించింది. ఓ ఏజెంట్‌ డ్రైవర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చింటును మోసం చేసి గొర్రెల కాపరి వీసా ఇప్పించాడు. దీంతో సౌదీకి వెళ్లిన అతను అక్కడ గొర్రెల కాపరిగా పనిచేయలేక ఇబ్బందులకు గురయ్యాడు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో అతని తల్లి లక్ష్మి ఈ ఏడాది జూన్‌ 30న సీఎం ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందజేసింది. విచారణ జరిపిన ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి బృందం సభ్యులు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేశాయి. దీంతో గతనెల 19న ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ (తెలుపు పాస్‌పోర్టు), 21న ఎగ్జిట్‌ వీసా జారీ చేయించారు. దీంతో పాటు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌ (సాటా) రియాద్‌ విభాగం అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్‌ సహకారంతో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది. బాధితుడి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో రూ.30 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధినుంచి మంజూరు చేయాలని విన్నవించినట్లు తెలిపారు. నిధులు విడుదల కాగానే ఫ్లైట్‌ టిక్కెట్‌ అందించి స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement