రైతు గర్జన విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతు గర్జన విజయవంతం చేయాలి

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

ఆదిలాబాద్‌టౌన్‌: నవంబర్‌ 1న ఆదిలాబాద్‌లో నిర్వహించే రైతు గర్జన సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నా రు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్‌ దేశ్‌పాండే కేటీఆర్‌ సమక్షంలో హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నా రు. రైతు గర్జన సభకు కేటీఆర్‌ హాజరవుతున్నట్లు చెప్పారు. అనంతరం భార్గవ్‌ దేశ్‌పాండే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌ను ఎవరు నాశనం చేయరని, రేవంత్‌ రెడ్డే బొందపెడతాడని అన్నారు. అనంతరం మాజీ మంత్రి రైతు గర్జనకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందులో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు సాజిదొద్దీన్‌, వెంకట్‌, వసంత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement