నిజాం గుండెల్లో సింహస్వప్నమైన ఆదివాసీ బిడ్డ
గిరిజన హక్కుల కోసం పోరాడిన వీరుడు
జల్, జంగల్, జమీన్ కోసం గెరిల్లా యుద్ధం
అనుచరుడి వెన్నుపోటుతో అసువులుబాసిన యోధుడు
నేడు జోడేఘాట్‌లో 86వ వర్ధంతి
1901లో ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామంలో కుమురం చిన్ను, సోంబాయి దంపతులకు కుమురంభీం జన్మించారు. నిజాం కాలంలో పెత్తందార్లు, అటవీ అధికారుల అకృత్యాలను చూసిన భీంకు స్నేహితుడి వేళ్లు నరికిన ఘటన, ఆదివాసీ మహిళలపై జరిగిన అకృత్యాలు తీవ్ర కోపం కలిగించాయి. తండ్రి మరణం తర్వాత సోదరులతో కెరమెరి మండలం సుర్దాపూర్‌కు వెళ్లారు. అక్కడ సిద్దిక్ జాగీర్దార్ భూములు తనవని ప్రకటించి గొడవలో మరణించాడు. ఆ ఘట న తర్వాత భీం బల్లార్షా మీదుగా చాందాకు, తర్వాత అస్సాంలోని తేయాకు తోటల్లో ఐదేళ్లు పనిచేసి తిరిగి వచ్చారు.
జోడేఘాట్‌లో గెరిల్లా పోరాటం
జోడేఘాట్ కేంద్రంగా సూరు, వెడ్మ రాముతో కలిసి భీం గెరిల్లా యుద్ధం ప్రారంభించారు. విల్లంబులు, బాణాలు, నాటు తుపాకులతో యువకులకు శిక్షణ ఇచ్చారు. పన్నులు చెల్లించవద్దని ప్రజ లకు పిలుపునిచ్చారు. అధికారులు, వ్యాపారులపై దాడులు సాగించి బాబేఝరి చుట్టూ 12 గ్రామాలు నెలకొల్పారు. ఇవి పోరు గ్రామాలుగా ప్రసిద్ధికెక్కాయి. హైదరాబాద్‌లో నవాబును కలవాలని వెళ్లినా అవమానం పాలై తిరిగి వచ్చి స్థానిక అటవీ అధికారులను తరిమికొట్టారు. ప్రతీ ఇంటి నుంచి పోరాటయోధుడు కావాలని పిలుపునిచ్చి ప్రత్యేక సాయుధ దళం ఏర్పాటు చేశారు.
పౌర్ణమి రోజు వీరమరణం
సబ్ కలెక్టర్‌తో సాగిన చర్చల్లో 12 గ్రామాలపై రాజ్యాధికారం కోరిన భీం ప్రతిపాదనలను తిరస్కరించా రు. దీంతో నిజాం సైన్యంతో ఏడు నెలలపాటు పో రు సాగించాడు. అనుచరుడు మడావి కొద్దు ఇచ్చిన సమాచారంతో 1940 అక్టోబర్ 10న ఆశ్వయుజ పౌర్ణమి రోజు ఐదు గంటలకు కుమురంభీం వీరమరణం పొందారు. నాలుగు దశాబ్దాలుగా కెరమెరి మండలం జోడేఘాట్‌లో వర్ధంతి నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హాజరై రూ.25 కోట్లు మంజూరు చేశారు. స్మారక చిహ్నం, స్మృతివనం, గిరిజన మ్యూజియం నిర్మించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో సోమవారం 86వ వర్ధంతిని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు.
బ్రిటీష్ ప్రభుత్వం దేశంలోని సహజ సంపదను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించిన కాలం అది. నిజాం రాజు ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకుని హైదరాబాద్ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. ఉమ్మడి జిల్లా పరిధిలోని గిరిజనులపై దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయి. బ్రిటీష్ పాలకుల దురాగతాలు, దోపిడీకి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో దూకిన ఎందరో విప్లవకారులు దేశం కోసం ప్రాణాలర్పించారు. అదే కోవలో హైదరాబాద్ నిజాం, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జల్, జంగల్, జమీన్ నినాదంతో పోరుబాట పట్టాడు గోండు బెబ్బులి కుమురం భీం. సొంత గెరిల్లా సైన్యంతో
రజాకారులపై యుద్ధం చేశాడు. దట్టమైన అడవుల్లో ఆదివాసీలను పోగుచేసి సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు అనుచరుడి వెన్నుపోటుతో వీరమరణం పొందాడు. తమ హక్కులు, మనుగడ కోసం ప్రాణాలర్పించిన భీం ఇప్పటికీ ఆదివాసీల ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్నాడు. నేడు భీం వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. – ఆసిఫాబాద్


