జోడేఘాట్‌ ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

జోడేఘాట్‌ ముస్తాబు

Oct 26 2026 12:10 AM | Updated on Oct 26 2026 12:10 AM

● భీం వర్ధంతికి హాజరుకానున్న ఇద్దరు రాష్ట్ర మంత్రులు ● ఉమ్మడి జిల్లా నుంచి తరలిరానున్న ఆదివాసీలు

జోడేఘాట్‌లో ప్రజలు కూర్చునేందుకు వీలుగా వేసిన టెంట్లు

కెరమెరి: కుమురంభీం 86వ వర్ధంతికి కెరమెరి మండలంలోని జోడేఘాట్‌ ముస్తాబైంది. భీం విగ్రహంతోపాటు మ్యూ జియం, జెండాలను అందంగా తీర్చిదిద్దారు. ప్రజల కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖుల కోసం హెలిప్యాడ్‌ సిద్ధం చేశారు. గిరిజన సంప్రదాయం ప్రకారం సోమవారం ఉదయం 8 గంటలకు జెండాలు ఆవిష్కరించనున్నారు. 9 గంటలకు సమాధి వద్ద పూజలు చేసి 10 గంటలకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. మధ్యాహ్నం గిరిజనులతో ప్రత్యేక దర్బార్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆదివాసీలు హాజరు కానున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యక్తిగత కారణాలతో హాజరుకావడం లేదని తెలుస్తోంది.

హాజరుకానున్న ప్రముఖులు..

రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తోపాటు ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె.హరిత, ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సీతక్క బేగంపేట నుంచి ఉదయం బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు జోడేఘాట్‌ చేరుకోనున్నారు. అలాగే మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ఉదయం 8 గంటలకు జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి నుంచి 11 గంటలకు జోడేఘాట్‌కు వస్తారు. వీరు దర్బార్‌తోపాటు ఇతర కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొననున్నారు.

12 వేల మంది అంచనా..

భీం వర్ధంతికి 12వేల మందికి పైగా హాజరవుతా రని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆసిఫా బాద్‌ డిపో నుంచి పది ప్రత్యేక బస్సులు నడపనున్నారు.హట్టినుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ప్రత్యేకంగా వచ్చే ప్రైవేట్‌ వాహనా లకు పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. 20 వేల మంది వరకు భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement