ఆదిలాబాద్‌టౌన్: బతుకమ్మ సంబరాలను జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు, ఉయ్యాల పాటలు, మహిళల కోలా టాలు, నృత్యాలతో ప్రాంగణమంతా సందడిగా మారింది. ఎస్పీ అఖిల్ మహాజన్ కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పో లీసు కుటుంబాల మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పి.మౌనిక, బి.సురేందర్‌రావు, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, మహిళా పోలీసు సిబ్బంది, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


