ఆదిలాబాద్‌టౌన్: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. వారం వ్యవధిలో నమోదైన సైబర్ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను శనివారం వెల్ల డించారు. గడిచిన వారం రోజుల్లో 28 సైబర్ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వీటిలో ఆన్లైన్ మోసాలు, యూపీఐ లావాదేవీలు, నకిలీ పెట్టుబడులు, గిఫ్ట్, ఆఫర్ల పేరుతో ప్రజలు మోసపోయినట్లు పేర్కొన్నారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపడం, బహుమతులు అందిస్తామని నమ్మించడం, నకిలీ పెట్టుబడి పథకాలు, ఆన్లైన్లో కొనుగోళ్లు, ఫోన్‌పే ద్వారా ప్రజలు మోసపోయినట్లు వివరించారు. మావల, ఇచ్చోడ, గుడిహత్నూర్, ఆదిలాబాద్ పట్టణంలోని టూటౌన్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైనట్లు వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్‌లను ఓపెన్ చేయవద్దని, ఓటీపీలు, యూపీఐలను ఎవరికి చెప్పవద్దని సూచించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆర్థిక సాయం, ఉద్యోగం, ప్రాంచేజ్ ఆఫర్లను పూర్తిగా నిర్ధారించిన తర్వాతే స్పందించాలన్నారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు సమాచారం అందించాలని వివరించారు.
రాష్ట్ర ట్రాక్ సైక్లింగ్ కోచ్‌గా పాండు జాదవ్
ఆదిలాబాద్: నేరడిగొండ మండలం సక్రియనాయక్ తండాకు చెందిన ఎన్ఐఎస్ కోచ్ పాండు జాదవ్ తెలంగాణ రాష్ట్ర ట్రాక్ సైక్లింగ్ జట్టు కోచ్‌గా ఎంపికయ్యాడు. జార్ఖండ్ రాష్ట్రం రాంచీ వేదికగా అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు నిర్వహించనున్న 78వ సీనియర్, 42వ జూనియర్ జాతీయస్థాయి ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్‌కాంత్ రావు ఎంపిక పత్రం జారీ చేశారు. పాండు జాదవ్ ఎంపికపై పలువురు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.


