పోటాపోటీగా హ్యాండ్‌బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా హ్యాండ్‌బాల్‌ పోటీలు

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల మైదానంలో శనివారం ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీలు పోటా పోటీగా సాగాయి. ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల నుంచి 80 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన 18 మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందరావు తెలిపారు. ఈ నెల 30 వరకు జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 31 నుంచి నవంబర్‌ 2 వరకు ఖమ్మంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్‌ అరవింద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌, నోడల్‌ అధికారి మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్‌, జీసీడీవో శకుంతల, హెచ్‌ఎం లింబరావు, పీడీ పీఈటీలు లక్ష్మణ్‌, రాకేష్‌, సరిత, రవి, సాయి, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement