ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని వడ్డెరబస్తీలో ఎక్సైజ్, ప్రోహిబిషన్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం సంయుక్తంగా దా డులు నిర్వహించి భారీగా నిల్వ ఉంచిన దేశీ దారు మద్యాన్ని పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి మద్యం తీసుకొచ్చి వడ్డెరకాలనీలో నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో కాలనీకి చెంది న మక్కల సుజాత ఇంట్లో తనిఖీ చేయగా రూ. 36 వేల విలువైన 900 బాటిళ్లు (81 లీటర్లు), దారంగుల గణేశ్ కారులో రూ.96వేల విలువైన 90 ఎంఎల్ బాటిళ్లు 2,400 (216 లీటర్లు) స్వాధీనం చేసుకున్నారు. మద్యం, కారు స్వాధీ నం చేసుకుని ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ ఎకై ్సజ్ సీఐ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. దాడుల్లో ఎకై ్సజ్ అధికారులు దేవేందర్, శ్రావణ్ కుమార్, సిబ్బంది కృష్ణ, శివకుమార్, నరేష్, బీరయ్య, హరీష్ పాల్గొన్నారు.


