నిర్మల్టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్–17 క్రికెట్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్న్స్లో నిర్మల్ జిల్లా జట్టు విజేతగా నిలిచింది. కొండాపూర్లోని నిర్మల్ క్రికెట్ అకాడమీ మైదానంలో శనివారం నిర్వహించిన ఈ పోటీల్లో నిర్మల్ జట్టు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ నెల 26 నుంచి 29 వరకు గద్వాల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్–17 క్రికెట్ పోటీల్లో జిల్లా తరపున ఆడనున్నారు. ఈ కార్యక్రమంలో జట్టు కోచ్ సుదర్శన్, ఎస్జీఎఫ్ కార్యదర్శి లక్ష్మణ్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.శ్రీనివాస్, రమణారావు, రమణ, బుచ్చి రామారావు, వన్నెల భూమన్న, రాష్ట్రపాల్ సాయి, గోపాల్, తదితరులు పాల్గొన్నారు


